Monday, June 7, 2010

మగధీర విజయరహస్యం

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బ్లాగు లోకానికి అడుగుపెట్టాను.కారణాలనేకమైనా ఈ రెండు నెలలుగా జరిగిన ఎన్నో సంఘటనలు మీతో పంచుకొవాలి.ముఖ్యంగా కౌముది మాస పత్రిక అమూలాగ్రం చదవాను.నిజంగానన్నో లోకంలోకి తీసుకెళ్ళింది."మొదటి సినిమా" శీర్షిక వర్ఠమాన రచయితల జీవన పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రచన.ఇది ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకం. ఇక యండమూరి వీరేంద్రనాథ్ గారి "పాపులర్ రచయిత అవడం ఎలా? " మరో అద్బుత పుస్తకం.రచయితగ ఎదగాలనికునే ప్రతి ఒక్కరు చదవాల్సిన కాదు కాదు అచరించాల్సిన గొప్ప పుస్తకమది.".. ఇక్కడ మీకో ముఖ్యవిషయం చెప్పదలచుకున్నాను.యండమూరి వీరేంద్రనాథ్ గారు నవలను ఎలా ప్రారంభించాలని చెబుతూ ఇలా అన్నారు."నవల ప్రారంభించబోయే ముందు మనం మెదటి నాలుగు పేజీల్లోనే పాఠకుల్ని మూడ్ లోకి తీసుకెళ్ళాలి. మొదటి అధ్యాయం పూర్తయ్యేసరికల్లా పాఠకుడిని పుస్తకం వదిలిపట్టలేనంత మూడ్ లోకి తీసుకెళ్ళగలిగితే సాధారణంగా ఆ నవల క్లిక్ కాకపొవటం అంటూ జరగదు.నవలా ప్రారంభంలోనే ఏదో ఒక నాటకీయ సంఘటనని సృష్టించటం ఎప్పుడూ పాపులర్ నవలకు మంచిదే.తీసుకున్న థీం ఏదైనా ప్రారంభం మాత్రం అకట్టుకునేలా ఉండాలి."ఇంతకీ ఈ విషయం ఎందుకు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఈ వాక్యాలు చదివిన తర్వాత "మగధీర" చిత్రం గుర్తొచ్చింది.ఆ చిత్రం అంతగా విజయవంతం కావటానికి కారణం ఏమిటని ఎందరినో అడిగాను.చాలమంది గ్రాఫిక్స్ అంటే ,పాటలని కొందరు,ఆర్ట్ అని కొందరు,ఫైట్స్ అని కొందరు,కాజల్ అందమని కొందరు,పబ్లిసిటీ అని కొందరు, పైవన్నీ అని కొందరు అన్నారు. కాని నాకనిపించిది ఇవ్వన్నీ కాదు.చిత్రప్రారంభంలోని మెదటి సీను. మిత్రవింద,కాలభైరవలు భైరవకొన పైనుంచి గాల్లో తేలిపోతూపడిపొవటం ఎవరో మిత్రుడు అన్నట్టు "రాజమౌళి ఈ స్టోరీకి మూలం ఏమిటనే పాయింట్ తో కథ మొదలుపెట్టడం ద్వారా ప్రేక్షకులలో క్యూరియాసిటీని రేకెత్తించగలిగారు"దాన్ని చిత్రం చివరిదాక కొనసాగించగలిగాడు.దీనికి పాటలు,కళ,స్టైల్ ,అదనపు అకర్షణలు వెరసి తెలుగు చిత్రసీమలో అద్బుత విజయం ఆవిష్కృతమైంది.హాలివుడ్ చిత్రాల్లో ఈ తరహా చిత్రణ కనిపిస్తుంటుంది.నాకైతే నవలలు చదవటం అలవాటు లేదు కాని "దిరిసెన పుష్పాలు" బ్లాగు రచయిత్రి గారు కొద్దిగా ఇలాంటి ప్రారంభాన్ని ఇవ్వగలుగుత్తున్నా చివరి దాకా కొనసాగించటంలో ఏదో వెలితి కనిపిస్తుంది.ఇక ఏ బ్లాగర్లు కూడా తమ టపాల్లో ఈరకమైన ఆసక్తి కలిగించే ప్రారంభానిచ్చి చివరికంటా కొనసాగించాలన్న తపన కనిపించకపోవటం పెద్ద లోటే.బ్లాగరు మహాశయులారా,సాయితీప్రియులు,రచయితలు ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి.

Monday, April 12, 2010

సానియా మిర్జా-షోయబ్ ,ఆ నలుగురు

హైదరబాదు లో కర్ఫ్యూ తొలిగింది.నగరానికొక మచ్చలా ఉన్న ఈ భూతం వీడింది.భాగ్యనగర ప్రతిష్ట మరోసారి ప్రపంచ యవనికపై రెపరెపలాడింది.కొంతమంది ఛాందసవాదుల ఫలితంగా విలవిల్లాడిన నగరం పూర్తిగా తెరుకొంది. కాని దురదృష్టకరవిషయమేమిటంటే సానియా వ్యక్తిగత విషయాలను చిలువలు పలువలు చేస్తూ ప్రసారం చెస్తున్న మీడియా ,నగరంలో మతసామరస్యం నెలకొల్పడానికి కృషి చేసిన "శాంతి దూతల"ను విస్మరించింది.సానియ-షోయబ్ ల ప్రేమ,పెళ్ళి విషయాలను ఊదరగొడుతున్న ఛానెళ్ళు,ఆసిఫ్ నగర్ కు చెందిన జితెందర్ మరియు జునైద్ ఖాన్ ల సాహసాన్ని ఊసెత్తలేదు.అల్లర్లు చెలరేగిన 28 వ తేదిన వీరిద్దరు కలిసి అపనమ్మకాలకు కారణమైన తమ బస్తీలోని జెండాలను తొలగించే పనిలో మునిగిపొయారు.వెంటనే మిగతా వారు తోడవడంతో ఆ కాలనీ లో ఎటువంటి అల్లర్లు జరగలేదు.అదెవిధంగా లాల్ దర్వాజ కు చెందిన దయానంద్ యాదవ్,ఆటొలో వెళ్తూ ఒక ముష్కర గుంపుకి చిక్కిన నలుగురు ముస్లిం యువతులను,ఒక బాలుడ్ని రక్షించిన తీరు ఏ ఛానెళుకూ కనబడలేదు.వినబడలేదు.కాని షోయబ్ తన తలక్ నామా లో తండ్రిపేరు తప్పుగా వ్రాసాడు అనే విషయం గొప్పగా పరిశోధన చేసి కనుకున్నాయి.ఇక హరిబౌలికి చెందిన రెహన ఖన్,ఒక గర్భినిని రక్షించి ఆస్పత్రికి చేర్చిన విషయాన్ని ఏ ఛానెలూ ప్రసారం చేయలేదు అదే అయెషా కు గర్భస్రావం అయింది అని వాళ్ళ ఫామిలీ డాక్టరు చెప్పిన విషయాన్ని రోజంతా ప్రసారం చేసారు.రైల్వే రక్షక దళానికి చెందిన శైలేష్ కుమార్ వాల్మీకి అనే ఒక ఇన్స్పెక్టరు ,మారణాయుధాలతో ఘర్షణకు సిద్ధంగా ఉన్న రెండు గుంపుల సమాచారాన్ని ,సర్కిల్ ఇన్ స్పెక్టరుకు చెరవేయటంతో పాటు సామాన్య ప్రజలెవ్వరు ఆ దరిదాపులకు రాకుండా ఆపిన విషయాన్ని ఏ ఛానెళ్ల నైనా మచ్ఛుకైనా కనిపించదు.కాని వస్తున్న బంధువులను ఒక్కర్ని వదలకుండా మనుకు చూపెడుతున్నారు.రండి ఆ శాంతి దూతలకు జేజేలు పలుకుదాం.ఈ మీడియా ధోరణిని ఎండగడదాం.

Monday, March 29, 2010

హైదరాబాద్ జిందాబాద్

మత సామరస్యానికి ప్రతీక,గంగ యమునల సంగమం అని చెప్పుకునే సంస్కృతికి చిహ్నం హైదరాబాద్ మరొక్కసారి కర్ఫ్యూ నీడన చిక్కుకొంది.గత రెండు రోజులుగ జరిగిన చెదురుమొదురు సంఘటనలు తారాస్టాయికి చేరటంతో ఫాతబస్తీలో నిరవధిక కర్ఫ్యూ విధించటం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది।మరో వైపు ఈ సున్నిత పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పాల్సిన రాజకీయ పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్నారు.ఇక మీడియా మతసామర్యాన్ని పెంచే విషయాలను అటుంచి ఈ అల్లర్ల వెనుక "రాజకీయ కుట్రకోణాన్ని" తీవ్రంగా పరిషోధిస్తూ గంటలకొద్ది చర్చల్ని ప్రచారం చెస్తోంది.ఇక మరో వైపు కొంతమంది ఈ అల్లర్ల వెనుక ప్రభుత్వ పతనానికి అధికార పక్షం లోని ఓ వర్గం ప్రయత్నమని ప్రచారం చేసేపనిలో పూర్తిగ నిమగ్నమైంది.మరో వైపు, పాతనగరంలో ప్రాబల్యం ఉన్న ఒక రాజకీయపార్టీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ అల్లర్లను సృష్టిస్తోందంటూ మిగతా రాజకీయ పక్షాలన్నీ విమర్శి స్తుండగా,ఆ రాజకీయ పక్షం మాత్రం మెజారిటి మతానికి చెందిన కొన్ని సంస్ఠల కుట్రగా ప్రతివిమర్శ చెస్తోంది.ఇక ఒక ఉద్యమ పార్టీ నాయకుడు ఒక చర్చలో మాట్లాడుతూ పోలిసు అధికారులందరు వలస ప్రాంతానికి చెందినవారు కావటం మూలాన పరిస్ఠితి చెయ్యిదాటిపోయిందని సూత్రీకరించారు.ఇలా విమర్స,ప్రతివిమర్శలతో ఊదరగొట్టడమేగాని కర్ఫ్యూ లో చిక్కుకొని అల్లాడుతున్న సామాన్యుని బ్రతుకుల గురుంచి గాని,రెక్కాడితే గాని డొక్కాడని దీనుల బ్రతుకుల రక్షణ గురుంచిగాని ఎవ్వరికి ఇసుమింతైనా సానుభూతి లేదు.ఇలా తమ స్వార్థ ప్రయోజనాలకోసం యెవరికి తొచినట్టు వారు ఈ సమస్యను మలచుకునే పనిలో ఉన్నారే గాని కలిసికట్టుగా ఆ ముష్కర మూకలను తరిమికొట్టడానికి ప్రజలందరిని సంఘటితపరచాలన్న ఆలొచన ఏమాత్రం కనిపించటలేదు।వారెన్ని రకాలుగా ప్రయత్నించినా హైదరాబాద్ లోని వివిధ మతాల ,భాషల ,ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న అనుభందాన్ని విడదీయలేరు.దేశ,విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలారా ఒక్కసారి అనండి "హైదరాబాద్ జిందాబాద్"

Thursday, March 25, 2010

అడవారి మాటలకి అర్ఠాలే వేరులే

కొన్ని భావల్లో,ప్రవర్తనల్లో అడవారు,మగవారు మాత్రం ఖచ్చితంగా వెర్వేరుగా ప్రవర్తిస్తారు. సాధారణంగా మగవారు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తారు.అవసరమనుకుంటే తప్ప ఎవరి సలహాలు స్వీకరించరు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి మరొ పనేదైన చేస్తారు మరి మహిళామణులు CLC టెక్నిక్ ఉపయొగిస్తారు. C అంటే Clap,L అంటే laugh ,C అంటే cry .ఒత్తిడిలో ఉన్నప్పుడు అ సమస్య గురుంచి తోటి మహిళతో చర్చిస్తారు .అందుకేనెమొ ఆఫీసుల్లో రాగానే,ఇంటిదగ్గర అడవాళ్ళయితే పనైపొగానే ఉప్పరి మీటింగుల్తో సేదతీర్తారు.ఇక మగమహారాజులెప్పుడు తమ పనుల్ని తామే పూర్తిచెసుకొని సాధించడంలో సంతృప్తి పొందుతారు.ఎవరైనా సహాయం ప్రత్యెకించి అడవారు ఎదైనా సమస్య గురించి చెబితే చాలు "శ్రీమాన్ సమస్యాపూరకుడి" లా ఉచిత సలహాలు ఇచ్చిపారేస్తరు. కాని మహిళామనులెప్పుడు కొరుకునేది ప్రేమ,వాత్సల్యం,.వీటిని పంచుకొవడంలొనే వారికి తృప్తి.వారికెదైన సమస్య ఎదురైతే ఇతరుల చెవులుపగిలేలా మాట్లాటంలోనే వారా సమస్యను పరిష్కరించుకుంటారు తప్పితే సమస్య పరిష్కారనికి సలహాకోసం కాదు. ఇక మగమహారాజులు.మహిళామణులు మట్లాడే ఒకే మాటలకి వెర్వేరు అర్థాలుంటాయి.ఉదాహరణకి ఇంటికి రాగానె "నేను చాల అలసిపొయాను. నేను ఇక ఏమి చేయలేను " అని ఆంటే మగవారి దృష్టిలో "నెను ఈరోజంతా బాగా పనిచేసాను.ఇక ఏ పని చెసే స్థితిలో లేను.నువ్వు నన్ను గుర్తిస్తావని అశిస్తున్నాను.నాను దగ్గరకు తీసుకొని ఓఅదార్చు." అని . ఇక అడవారి మాటలకి అర్ఠాలే వేరులే అని ఎప్పుడో అన్నారు.ఈవిధంగా చెప్పుకుంటూపొతే ఎన్నో మౌలిక బేధాలు కనిపిస్తాయి.ఈ భేధాలను గుర్తెరిగి మసలుకోవటంలోనే ఉంది అన్నది నేను కాదు "Men are from Mars women are from Venus" అన్న పుస్తకంలో john grey.

Sunday, March 7, 2010

మహిళలు మహరాణులు-వ్యక్తిత్వ నిర్మాణంలో మహిళల ఫాత్ర

"ఆడదే అధారం, మనకథ ఆడదే ఆరంభం,ఆడదే సంతోషం,మన కథ ఆడదే సంతాపం" అన్నాడో చలనచిత్ర రచయిత.నిజంగ చెప్పాలంటే ఒక మనిషి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుదన్నమాట యెంత నిజమొ నాకు తెలియదు కాని ఒక పురుషిని వ్యక్తిత్వ నిర్మాణంలో మాత్రం స్త్రీ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుదని నా ప్రగాడ విశ్వాసం.ప్రతి మనిషి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి మెట్టమెదటగా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.స్వామి బుద్దానంద "HOW TO BUILD CHARACTER"అన్న పుస్తకంలో అన్నట్లు వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లి యెక్క పాత్ర లెక్కకట్టలేనిది..శివాజి తల్లి జిజియాబాయి రామాయణ,మహాభారత గ్రంధాల్ని వివరించకపొయినట్టయితే చరిత్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక గొప్ప హిందూ యొధుణ్ణి కొల్పొయేదెమే? ఈ సందర్భంగా నా వ్యక్తిగత జీవితంలోని ఒక చిన్న విషయం ప్రస్తావించలెకుండా ఉన్నాను. మా అమ్మగారికి రెడియో వినే అలవాటు ఉండేది.నేను ప్రతిరోజు ఆవిడతో పాటే ఆ అలవాటు చేసుకున్నాను.ఈ సమయంలో సంస్కృత భాష పరిచయ కార్యక్రమం వినేవాడిని.అందులోని ఓ సుభాషితం "కె యూన న విభూషయంతి పురుషాం,హారాన చందోజ్జ్వలన్,న స్నానం నవిలెపనం న కూసుమం నా లంకృతా మూర్దజా,వాన్యెకా సమలంకకరొతి పురుషాం యా సంస్కృతా ధార్యతే,క్షీయంతే ఖలు భుషణాని సతతం ,వాక్ భూషణం భూషణం".ప్రసారమైనప్పుడల్లా క్రమంతప్పకుండా వినడం జరిగేది.ఆ సుభాషితం యెక్క అర్థం "మనిషికి ఏది అభరణము.స్నానం,సుగంధద్రవ్యాలు,పువ్వులు,నగలు,శిరోలంకరణ ఇవి ఏవియు ఒక పురుషునికి అభరణములు కావు.యెందువలనంటే శరీరము.నశ్వరమైనది.మనిషికి వాక్ అభరణము"అని నేను ఇంటెర్మిడియట్ లొ తెలుసుకోవడంతో ఆ రోజు నుంచి నేను మాట్లాడే భాషను గాని మెరుగుపర్చుకొవాలని ప్రయత్నిస్తునేఉన్నాను.నా అమ్మగారు నాకు ఆ సుభాషితం వినే అలవాటు చెసుండకపొయినట్లయితే తెలుగు బాష కోసం పరితపించే ఓ వ్యక్తిని ఈ సమాజం కొల్పొయుండేది. ఇక వ్యక్తిత్వ నిర్మాణంలో తర్వాత ముఖ్యమైన పాత్ర నిర్వహించేది ఉపాద్యాయురాలు.సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయురాలు స్త్రీయే కాబట్టి మళ్ళీ స్త్రీయే ఈ పాత్ర నిర్వహిస్తుంది. ఇక తర్వాతి పాత్ర భార్యది. నా జీవితంలో నా భార్య " పోరు " కారణంగానే నేను ఉదయాన్నే నడకను అలవాటు చేసుకున్నాను.ఇది నా జీవితానికి ఒక గొప్ప ఆత్మవిమర్శ సాధనంగ ఉపయోగపడుతోంది. ఈ విదంగా ప్రతి పురుషిని జీవితంలో స్త్రీ అనెకానెక రకాలుగా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.కాబట్టి ఒక పురుషుని విజయం వెనకాల అనెక మంది స్త్రీలు ఉంటారనడంలో సందేహంలేదు.
కాని నేడు సమాజంలో స్త్రీ ని ఒక అబలగా మరీ ముఖ్యంగా చలనచిత్రాలలో అయితే ఒక వస్తువుగా చూపించటం బాధాకరం.చలనచిత్రాలలో యెల్లప్పుడూ ప్ర్రియుని కోసం పరితంచే ప్రియురాలిగానో , తన పెళ్ళి కోసం అన్నపై అధారపడే నిస్సహాయురాలైన చెల్లిగానో,కొడుకు సంపాదనపైనే అధారపడే తల్లిగానో,త్యాగంతో జీవితాన్ని భర్తకు అర్పించేసుకునే నిరర్ఠకత్యాగమూర్తిగానో చిత్రిస్తారు తప్పిస్తే ఒక వీరనారిగ,సబలగా,స్పూర్తిదాయకురాలిగ చిత్రించేవారు చాలా తక్కువ.కనీసం ఈ మహిళ దినొత్సవ సందర్భంగానైనా ప్రతి మహిళ అబల కాదు సబల అని నిరూపించేందుకు పునరంకితమవ్వాలని అశిస్తూ ,

Tuesday, March 2, 2010

విజయానికి ఐదు మెట్లు" మరియు నేను


నమస్కారములతో,

నేను మీకు చాలా రోజులుగా ఈ టపా వ్రాయాలనుకుంటున్నప్పటికీ "కర్ణుణి చావుకి కారణాలనేకం "అన్నట్టు నా వ్యక్తిగత విషయాలు మీకు ప్రస్తావించటం ఎందుకనో,తెలుగులో టైపు చెయ్యటం రాకపొవటం వల్లనో,ఇప్పటికె ఈ పుస్తకంపై లక్ష ఉత్తరాలు వచ్చినట్టు చదవటం మూలానా నా టపాని చదువుతారో లెదో అనే సందెహం వంటి అనేక కారణాల వలన ఇన్నాళ్ళు గా వాయిదావేస్తూవస్తున్నాను.అయితే ఇప్పుడు వ్రాయటానికి కారణం తెలుగులో టైపు ఎలా చెయ్యాలో తెలుసుకొవటం ,తెలుగులో నేనొక బ్లాగుని ప్రారంభించి పుస్తక సమీక్షలు వ్రాయటం మొదలుపెట్టటం మూలాన కలిగిన ప్రేరణ.

ఇక ఉపోద్ఘాతాన్ని వదిలి విషయానికి వస్తే పుస్తకంలో వ్రాసినట్టు ఒక పుస్తకం చదవటం వల్ల మనిషి తన ప్రవర్తన మార్చుకుంటాడా? కొన్ని విషయాల్లో ముఖ్యంగా దృక్పథం విషయంలొ తప్పక ఫ్రభావితులౌతారు అని అన్నారు.కచ్చితంగా ప్రభావితులౌతారు నాలాగ.నేను ఈ పుస్తకాన్ని చదివి నా జీవితా దృక్పథాన్ని మార్చుకొవడమే కాదు ఎంతో ప్రభావితుడనయ్యానో మీకీ లేఖ ద్వారా తెలుస్తుం
ఈ పుస్తకంలో నన్ను బాగా ప్రభావితం చేసిన అంశం "టైం మేనెజిమెంట్ మాట్రిక్స్".ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క అంశం నా జీవితాన్ని మలుపు తిప్పింది.సరిగ్గా నేను ఈపుస్తకాన్ని చదివే సమయంలో నా జీవితంలోని అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను.మా తండ్రిగారి అకాల మరణంతో కుటుంబ భాద్యతల్ని మొస్తూ ఎటు వైపు వెళ్ళాలో తెలియని జీవితపు కూడలిలో ఉన్న సమయం లో ఈ అంశం నాకు ఒక దిక్సూచిల పనిచెసింది.నేను నా భావి జీవితంలో చేయవలసిన పనులతో కూడిన నా స్వంత "టైం మేనెజ్ మెంట్ మాట్రిక్స్" ను తయారుచేసుకోవటం,అత్యంత ప్రాధాన్యమున్న అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తిచెయ్యటం ప్రారభించాను. అయితే ఈ అంశానికి మాతృక అయిన "the seven habits of highly effective people" అనె పుస్తకాన్ని చదివి మరింత అకళింపుచెసుకున్నాను.ఇక పై పుస్తకంలో తెల్పిన "Roles & Goals" అనే అంశాన్ని కూడ అచరణలో పెట్టాను. ఈ ఒక్క అలవాటు నెనిప్పటికీ కొనసాగిస్తుండడం వల్ల పది సంవత్సరాలక్రితం నా జీవితంలోని పాత్రలు కుటుంబ పెద్ద,వ్యక్తిగత,దిగువశ్రేణి గుమాస్తా కాస్త నేడు భర్త,వ్యక్తిగతం,ఎగువశ్రేణి గుమాస్తా,ఉద్యోగసంఘ జిల్లా అద్యకునిగా రూపాంతరం చెందాయి.

ఇక రెండోమెట్టు "మీ రేది బెస్ట్"లొని మెదటి ఆధ్యాయంలోని "మానవ సంబంధాలు" నన్ను ప్రభావితం చెసిన మరో అంశం.ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నా యొక్క ఇతరులతో సంబంధాలను ప్రస్తావించిన ఏ కేటగిరిలోకి వస్తాయొ అని బేరిజు వేసుకుంటాను.ఖచ్చితంగా కేవలం ఆకర్షణ కోసం ఇతరులతో సంబంధాలునెరుపను.నేను చాలాసార్లు జీవితంలో గుర్తింపుకోసం తపించి భాధ పడ్డా కాని ఎవిధంగా గుర్తింపులభిస్తుందో తెలిసిన తర్వాత కేవలం గుర్తింపు కోసం సంబంధాలు నెరిపే పద్దతికి స్వస్తిచెప్పాను.నెను చాలావరకు నా అభిరుచులు గల వారితోను ,అవసరం ఉన్న వారితోను సంబంధాలు నెరుపుతాను.
రెండో అద్యాంలో అత్మవిమర్శ మరో గొప్ప అంశం.ప్రతిరోజు నెను వాకింగ్ చేయటం అలవాటు చెసుకున్నాను.సారీ! ప్రతిరోజు కాకపోయినా గత పదిసంవత్సారాల నుండి ఈ అలవాటును మాత్రం వదల్లేదు.ఎందుకంటే నాకు ఇదో గొప్ప అత్మవిమర్శకు పనికొస్తున్న సాధనం.డైరీ వ్రాయటం మరో అలవాటు. పుస్తకం చదవగానే ఆ పని ప్రారంభిచాలనుకొన్నప్పటికీ గత రెండు సంవత్సరాల క్రితం ఒక ఆంగ్ల అచార్యులు గారు డైరీ వ్రయటం యెక్క ప్రాదాన్యత వివరించినప్పటినుంచి మెగ్గ తొడిగిన ఈ అలవాటు ఈనాదులో ప్రముఖుల డైరీ ల గురుంచి ఒక వ్యాసం చదివిన తర్వాత మరింత పెరిగింది.గతవారం నేను చదివిన "do it now " అనే పుస్తకం లో ప్రస్తావించిన డైరీ వ్రాసే పద్దతి నేను వ్రాసే పద్దతిని పోలి ఉండడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.
రెండోమెట్టులో రెండోఅధ్యాయంలొని కమ్యూనికేషన్ దానిలోని గాప్, మరో ఆసక్తికర అంశం.సూచించినట్టుగా నాకు ఎవరితో విభేదాలు వచ్చినా కమ్యూనికేషన్ ని మాత్రం వదల్లేదు.ఇది నాకు ఎవరినీ కూల్పొకుండా ఎంతగానో తోడ్పడింది.

మూడో మెట్టులోని "గెలువు వైపు మలుపు" లొ మొదటి అధ్యాయం" లొని మన తప్పులను ఒప్పుకొవటం మరో నేను అచరించిన అంశం.నేను ఈ పది సంవత్స్తరాలు ఎప్పుడైనా తప్పు చెస్తే నిజాయితీగా ఒప్పుకున్నా .కాదు అలవాటుగా మార్చుకున్నా.మరోసారి ఆ తప్పులను చెయకుండా జాగ్రత్తపడుతున్నాను.ఇది నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

మూడోమెట్టు "గెలుపువైపు పయనం"లొని మొదటి అధ్యాయంలొని భాష,సంభాషణ మరో అలోచింపచెసే అంశం.మనం ఎదుటి వారితో సంభాషణ ఎ విధంగా ఉండాలి?మన సంభాషణ ద్వారా ఇతరుల్లో ఎలాంటి ముద్ర వెస్తామొ బాగా చర్చించారు.అయితే భాష గురుంచి వివరణలో "క్షీ యంతే ఖలు భూషణాని సతతం,వాక్భూషణం భూషణం" అన్న భర్తృహరి సుభాషితం గురించి గాని,భగవద్గీత శ్లోకం"అనుద్వేగకరం వక్యం,న్యాయం ప్రియహితంచైవయత్,స్వాధ్యాభ్యాసనం చైవ వాజ్ఞయం తప ఉచ్యతె " గురుంచి ప్రస్తావించాలని కొరికున్నాను.
ఇక మిగతా నెను అలవర్చుకున్న అలవాట్లు పుస్తక పఠణం,దాదాపు ఈ పుస్తకంలో ప్రస్తావించిం న అన్ని పుస్తకాల్ని ఒకసారి చదివేసాను కాదు కాదు బద్రపరుచికొని అవసరమైనప్పుడల్లా తీసి మీ పుస్తకంలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాక్యాలు ఇవి 1)తాను నెరవేర్చవలసిన పనుల ప్రాముఖ్యతని వరుస క్రమంలో నిశ్చయించుకోలేకపొవటం 2)నేర్ఛుకొవలసిన పనులని వరుస క్రమం లో సక్రమంగా పూర్థిచెయ్యలెకపొవటం అదే వరుసక్రమంలో సక్రమంగా చెసే పనుల పట్ల క్రమశిక్షణ ,పట్టుదల లేకపొవటం.నేను ఎ పని మొదలు పెట్టినా ఈ వాక్యాలను గుర్తుపెట్టుకుంటాను.
ఇక చివరిగా,ఈ పది సంవత్సరాలలో అనేక సమస్యలను పరిష్కిరించటంలో ఒక్క పుస్తకం ఒక గొప్ప స్నెహితుడిల ఉపయొగపడంది.ఇంకా ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి.కానీ వాటిని పరిష్కరించేగలమనే సామర్థ్యం నాకుందనే నమ్మకం నాకుంది. ప్రస్తుతం నేను ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు అనేక సెవలందించే వ్యవస్థలో ఉన్నా,ఉద్యొగ సంఘ జిల్లా శాఖకి నాయకత్వం వహిస్తున్నా, ఒక రచయితగా కూడ ఎదగాలన్న అలొచన ఉంది.మరోవైపు ఏదో ఒక రూపంగా నా సెవలు ఉపయోగపడాలన్న కొరికా ఉంది.నా అలొచనలికి మీరు సూచనలందిస్తారని అశిస్తూ
మీ నిరంజన్

Sunday, February 14, 2010

ఘంటసాల గాన రాగ యాగం

పద్మశ్రీ ఘంటసాల అభిమానులకు అరుదైన అవకాశం.వంశీ ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సేవా సంస్థ అధ్వర్యంలో హైదరాబాద్ లోని త్యాగరాయగాన సభా సదనంలో "ఘంటసాల ఆరాధనోత్సవాలు" పేరుతో "ఘంటసాల గాన రాగ యాగం " 11-2-2010 నాడు ప్రారంభమయింది.ఈ యాగం 2-4-2010 వరకు అంటే 51 రొజులు కొనసాగుతుంది.ప్రతిరోజూ ఘంటసాల గారి పాటలను ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల పాటలు పాడుతున్న గాయనీ,గాయకులు మరియు తెలుగు చలనచిత్రసీమలో ఉన్న ప్రముఖ గాయనీ,గాయకులు ఆలపిస్తారనినిర్వాహకులు తెలిపారు.పండుగ వాతావరణంలో 51 రోజుల పాటు ఘంటసాల అభిమానులను అలరించబోతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల గారి గాన గంగలో తడిసిముద్దవ్వండి.ఘంటసాల పై మీ అభిప్రాయాల్ని మీ బ్లాగ్గుల్లో పంచుకోండి.

Sunday, January 31, 2010

"ఆరు బంగారు సూత్రాలు"

భార్య,భర్తల మధ్య,కుటుంబసభ్యుల మధ్య ,బిజినెస్ పార్టనర్స్ మద్య వివాదాల తలెత్తినప్పుడు,ఏ రెండు అక్షరాల మాట అద్భుతాలను చేయగలదో తెలుసుకొవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం డా .బి.వి.పట్టాభిరాం గారు వ్రాసిన "కమ్యూనికేషన్స్ మీ విజయానికి పునాది".ఈ పుస్తకంలో "సంభాషణ ఎలా ప్రారంభించాలి?ఏమిటి?ఎప్పుడు?ఎందుకు?ఎవరు?ఎక్కడ?ఎలా మాట్లాడాలి? వంటి విషయాలు ,ఎలా మాట్లాడకూడదు? ఆసెర్టివ్ వంటి విషయాలు ప్రాక్టికల్ గా చర్చించారు.ఈ పుస్తకంలొ "ఆరు బంగారు సూత్రాలు" అనే విభాగం నాకు బాగా నచ్చింది.సంభాషణ ప్రారభించేటప్పుడు గరాటు పద్దతి నాకు నచ్చిన మరో అంశం.ప్రతి ఒక్కరు చదవాల్సిన ఒక మంచి పుస్తకాన్ని అందించిన రచయితకు క్రుతజ్ఞతలు.

మనిషికి వాక్ అభరణమే కాదు రక్ష

నా చిన్నప్పటినుంచి నాకు తెలిసిన విషయం ఇది." కె యూన న విభూషయంతి పురుషాం,హారాన చందోజ్జ్వలన్,న స్నానం నవిలెపనం న కూసుమం నా లంకృతా మూర్దజా,వాన్యెకా సమలంకకరొతి పురుషాం యా సంస్కృతా ధార్యతే,క్షీయంతే ఖలు భుషణాని సతతం ,వాక్ భూషణం భూషణం".దీనర్ఠం. మనిషికి ఏది అభరణము.స్నానం,సుగంధద్రవ్యాలు,పువ్వులు,నగలు,శిరోలంకరణ ఇవి ఏవియు ఒక పురుషునికి అభరణములు కావు.యెందువలనంటే శరీరము.నశ్వరమైనది.మనిషికి వాక్ అభరణము.నెను ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావించవలసివచ్చింది అంటె ఈరొజు నేను వాక్ అభరణమే కాదు రక్ష అన్న విషయం తెలుసుకున్నాను.

మాట మంత్రమా?

మీరు మీ మాటల్తో ఎదుటి వారిలో ప్రేరణ కలిగించాలనుకొంటున్నారా? వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి,పదును పెట్టి,నైపుణ్యం కల వారుగ తీర్చిదిద్దటానికి ఏది ఉపయోగపదుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?అయితే మీరు డాబి.వి.పట్టాభిరాం రచించిన "మాటే మంత్రము" పుస్తకాన్ని చదవాల్సిందే.
వారు ఈ పుస్తకంలో మాటలు మంత్రాల్లాగ ఏ విధంగా పని చేస్తాయి? కమ్యూనికేషన్ "9సి" టెక్నిక్స్,కమ్యూనికేషన్ పద్దతులు,బాడీ లాంగ్వేజి,పబ్లిక్ స్పీకింగ్ యెలా?,టెలిఫోన్ మానర్స్,వినడం,Transactional Analysis,కమ్యూనికేషన్ స్థితులు,కమ్యూనికేషన్ గాప్,ఎమోషనల్ ఇంటలిజెన్స్ గురుంచి ప్రాక్టికల్ గా వివరించారు.ఈ పుస్తకంలో "నేను క్షెమం ,మీరు క్షెమం " అన్న విభాగంలోని కమ్యూనికేషన్ లోని మూడు స్థితుల కు సంబందించిన అంశం బాగా నచ్చింది.ప్రత్యేకించి కమ్యూనికేషన్ గాప్ వల్ల వచ్చె అనర్థాలను వివరిస్తూ పోలీసు శాఖలోని ఒక సంఘటన ద్వారా వివరించిన తీరు బాగా నచ్చింది.సరళమైన పదాలతో ,చక్కని బొమ్మలతో,మంచి ఉదహరణలతో తేలికగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని రూపొందిచినందులకు రచయుతకు దన్యవదాలు.

Thursday, January 28, 2010

"వేల పాటల నిధి" వేటూరికి వెనవేల నమస్కారాలు

ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని "శంకరాభరణం" లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు."సిరి సిరి మువ్వలో" వారు వ్రాసిన"ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల" అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి."ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన" అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే "మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ" అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,"నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక "అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని"స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా " అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే."నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు""మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం' అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే ."క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు" అని తట్టిలేపింది వారె."ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె" అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే."ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది." అని కులాలు లేవు అని చెప్పందీ వారె."పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో" అని ఒక అమాయక కొయదొర భక్తిని "ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము " అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె."ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ" అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే."నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన" అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ "అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె."ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ," అని "అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ " అంటూ ధైర్యాన్నిచ్చింది వారె."వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం " అని చెప్పిన అయనే "అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం" అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

Friday, January 15, 2010

సంక్రాతి శుభాకాంక్షలతో నా ఈ నూతన ప్రపంచానికి స్వాగతం.గత సంవత్సరం నేను చేయవలసిన పనుల గురుంచి అలోచిస్తూ పత్రికలకి వ్యాసాలు వ్రాయలని అనుకున్నాను.కాని నా ఆ కోరిక అనేక కారనాలవలన తీరలేదు.కాని ఇప్పుదు ఈ విధంగ నా సొంత బ్లాగు ద్వారా ఆ కోరిక తీరబొతున్నందులకు యెంతో అనందంగ ఉన్నది.