ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చూడాల్సిన సినిమా "న్యూటన్"
త్వరలో జరగబోయే మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైద్రాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల వికారాబాద్ జిల్లా మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ కు హాజరు అవడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో నేను చూసిన న్యూటన్ సినిమా గుర్తుకొచ్చింది
ఎన్నికల్లో పాల్గొనే అధికారుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అధికారుల్లో స్ఫూర్తి నింపుతుంది. 2017లో విడుదలైన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ ప్రధానపాత్రలో నటించగా.. పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషించాడు
ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించేవారికి ఇది స్ఫూర్తినిస్తుంది
ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్‌కుమార్ రావ్ నటించాడు. ఎన్నికల విధుల్లో భాగంగా అతడిని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో విధులను కేటాయిస్తారు. ఆ పోలింగ్ బూత్ వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్‌గా పంకజ్ త్రిపాఠి కూడా భద్రతా అధికారిగా నియమిస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఈ అధికారులు పోలింగ్ ఏ విధంగా ముగించారనే నేపథ్యంతో ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కింది.
బిహార్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారుల్లో స్ఫూర్తిని నింపడానికి వారి శిక్షణలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు