Monday, April 12, 2010

సానియా మిర్జా-షోయబ్ ,ఆ నలుగురు

హైదరబాదు లో కర్ఫ్యూ తొలిగింది.నగరానికొక మచ్చలా ఉన్న ఈ భూతం వీడింది.భాగ్యనగర ప్రతిష్ట మరోసారి ప్రపంచ యవనికపై రెపరెపలాడింది.కొంతమంది ఛాందసవాదుల ఫలితంగా విలవిల్లాడిన నగరం పూర్తిగా తెరుకొంది. కాని దురదృష్టకరవిషయమేమిటంటే సానియా వ్యక్తిగత విషయాలను చిలువలు పలువలు చేస్తూ ప్రసారం చెస్తున్న మీడియా ,నగరంలో మతసామరస్యం నెలకొల్పడానికి కృషి చేసిన "శాంతి దూతల"ను విస్మరించింది.సానియ-షోయబ్ ల ప్రేమ,పెళ్ళి విషయాలను ఊదరగొడుతున్న ఛానెళ్ళు,ఆసిఫ్ నగర్ కు చెందిన జితెందర్ మరియు జునైద్ ఖాన్ ల సాహసాన్ని ఊసెత్తలేదు.అల్లర్లు చెలరేగిన 28 వ తేదిన వీరిద్దరు కలిసి అపనమ్మకాలకు కారణమైన తమ బస్తీలోని జెండాలను తొలగించే పనిలో మునిగిపొయారు.వెంటనే మిగతా వారు తోడవడంతో ఆ కాలనీ లో ఎటువంటి అల్లర్లు జరగలేదు.అదెవిధంగా లాల్ దర్వాజ కు చెందిన దయానంద్ యాదవ్,ఆటొలో వెళ్తూ ఒక ముష్కర గుంపుకి చిక్కిన నలుగురు ముస్లిం యువతులను,ఒక బాలుడ్ని రక్షించిన తీరు ఏ ఛానెళుకూ కనబడలేదు.వినబడలేదు.కాని షోయబ్ తన తలక్ నామా లో తండ్రిపేరు తప్పుగా వ్రాసాడు అనే విషయం గొప్పగా పరిశోధన చేసి కనుకున్నాయి.ఇక హరిబౌలికి చెందిన రెహన ఖన్,ఒక గర్భినిని రక్షించి ఆస్పత్రికి చేర్చిన విషయాన్ని ఏ ఛానెలూ ప్రసారం చేయలేదు అదే అయెషా కు గర్భస్రావం అయింది అని వాళ్ళ ఫామిలీ డాక్టరు చెప్పిన విషయాన్ని రోజంతా ప్రసారం చేసారు.రైల్వే రక్షక దళానికి చెందిన శైలేష్ కుమార్ వాల్మీకి అనే ఒక ఇన్స్పెక్టరు ,మారణాయుధాలతో ఘర్షణకు సిద్ధంగా ఉన్న రెండు గుంపుల సమాచారాన్ని ,సర్కిల్ ఇన్ స్పెక్టరుకు చెరవేయటంతో పాటు సామాన్య ప్రజలెవ్వరు ఆ దరిదాపులకు రాకుండా ఆపిన విషయాన్ని ఏ ఛానెళ్ల నైనా మచ్ఛుకైనా కనిపించదు.కాని వస్తున్న బంధువులను ఒక్కర్ని వదలకుండా మనుకు చూపెడుతున్నారు.రండి ఆ శాంతి దూతలకు జేజేలు పలుకుదాం.ఈ మీడియా ధోరణిని ఎండగడదాం.

4 comments:

Unknown said...

గురువు గారు,
వాళ్ళకి కావలిసింది TRP రేటింగులు, ఈ విషయాలన్నీ చెబితే వాళ్ళు మీడియా వాళ్ళు ఎలా అవుతారు ?? వాళ్ళకి TRP రేటింగ్ ఎలావస్తుంది ... ??? అదే సానియా గురించి చెప్పండి గంటల తరబడి చూస్తాము .చెప్పింది చెప్పి చెప్పి మన టీవి యాంకర్లు ఊదరగొడుతున్న మనం మాత్రం దాన్నే చూస్తాము. మేము నెంబర్ ఒన్ అంటే మేము ఒన్ అని ఎవరికి వాళ్ళు చెప్పుకోవటమే తప్ప ... వాళ్ళు ఎపుడు మీడియా ఎలా ప్రవర్తించాలో అలా ఎన్నడు ప్రవర్తించలేదు. ఘర్షణల సమయం ఎవరేరు తమతమ ధైర్య సాహసాలు చూపారో వాళ్ళందరకి పేరు పేరున జోహార్లు ...

Rishi said...

mana chaanellu kaasiki velli vignata ni eppudo vadilesi vachhaayi..Inkaa meeku teliyakapovatemitandee...

amma odi said...

మంచి టపా వ్రాసారు. నెనర్లు! కొనసాగించండి....

kumar said...

చాలా బాగా చెప్పారు.గురూ,హాట్సాఫ్,మీడియా మొహంమీద గుద్దినట్టు చెప్పారు.