యూట్యూబ్‌లో తెలంగాణ పల్లె పాట ‘ఆడ నెమలి'కు నెటిజన్లు పట్టం కడుతున్నారు.
ఈ తరహా పాటలు పాడే సింగర్ మంగ్లీ తన యూట్యూబ్ చానల్‌లో స్వచ్ఛమైన తెలంగాణ పల్లె గొంతుక ‘కనకవ్వ’తో కలిసి పాడిన ‘ఆడ నెమలి’ అనే పాట దుమ్ములేపుతోంది.తెలంగాణ లో ఏ పెళ్లి డిజేలో చూసినా ఇదే పాట వినిపిస్తోంది.
‘నర్సపెల్లి గండిలోన గంగధారి.. ఆడ నెమలి ఆటలకు గంగధారి’ అంటూ సాగే పాట యూట్యూబ్ ప్రేక్షకులనే కాక.. సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గత ఏడాది ఆగస్టు 29న విడుదలైన ఈ పాటను మంగ్లీతో పాటు ‘డివ డివ, గుట్ట గుట్ట తిరిగెటోడ’ వంటి జనాదరణ పొందిన పాటలతో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జాను లిరీపై చిత్రీకరించారు. ఇప్పటికే తన గాత్రంతో యావత్ తెలంగాణను ఉర్రూతలూగిస్తోన్న కనకవ్వ వాయిస్ ఈ పాటకు ప్రత్యేకార్షణ.
మంగ్లీ, జాను లిరీ తమ డ్యాన్స్‌తో ఈ పాటకు కొత్త జోష్‌ను తీసుకురాగా.. పల్లెటూరి అందాలను సరికొత్తగా చూపించిన ఈ పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విడుదలైన నాలుగు నెలల్లోనే పదకొండు కోట్లమంది వీక్షించడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే మంగ్లీ యూట్యూబ్ చానల్‌కు మంచి ఆదరణ దక్కుతుండగా.. 10 లక్షలకు పైగా సబ్‌స్కైబర్లు ఉండటం విశేషం
No comments:
Post a Comment