Sunday, March 7, 2010

మహిళలు మహరాణులు-వ్యక్తిత్వ నిర్మాణంలో మహిళల ఫాత్ర

"ఆడదే అధారం, మనకథ ఆడదే ఆరంభం,ఆడదే సంతోషం,మన కథ ఆడదే సంతాపం" అన్నాడో చలనచిత్ర రచయిత.నిజంగ చెప్పాలంటే ఒక మనిషి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుదన్నమాట యెంత నిజమొ నాకు తెలియదు కాని ఒక పురుషిని వ్యక్తిత్వ నిర్మాణంలో మాత్రం స్త్రీ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుదని నా ప్రగాడ విశ్వాసం.ప్రతి మనిషి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి మెట్టమెదటగా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.స్వామి బుద్దానంద "HOW TO BUILD CHARACTER"అన్న పుస్తకంలో అన్నట్లు వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లి యెక్క పాత్ర లెక్కకట్టలేనిది..శివాజి తల్లి జిజియాబాయి రామాయణ,మహాభారత గ్రంధాల్ని వివరించకపొయినట్టయితే చరిత్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒక గొప్ప హిందూ యొధుణ్ణి కొల్పొయేదెమే? ఈ సందర్భంగా నా వ్యక్తిగత జీవితంలోని ఒక చిన్న విషయం ప్రస్తావించలెకుండా ఉన్నాను. మా అమ్మగారికి రెడియో వినే అలవాటు ఉండేది.నేను ప్రతిరోజు ఆవిడతో పాటే ఆ అలవాటు చేసుకున్నాను.ఈ సమయంలో సంస్కృత భాష పరిచయ కార్యక్రమం వినేవాడిని.అందులోని ఓ సుభాషితం "కె యూన న విభూషయంతి పురుషాం,హారాన చందోజ్జ్వలన్,న స్నానం నవిలెపనం న కూసుమం నా లంకృతా మూర్దజా,వాన్యెకా సమలంకకరొతి పురుషాం యా సంస్కృతా ధార్యతే,క్షీయంతే ఖలు భుషణాని సతతం ,వాక్ భూషణం భూషణం".ప్రసారమైనప్పుడల్లా క్రమంతప్పకుండా వినడం జరిగేది.ఆ సుభాషితం యెక్క అర్థం "మనిషికి ఏది అభరణము.స్నానం,సుగంధద్రవ్యాలు,పువ్వులు,నగలు,శిరోలంకరణ ఇవి ఏవియు ఒక పురుషునికి అభరణములు కావు.యెందువలనంటే శరీరము.నశ్వరమైనది.మనిషికి వాక్ అభరణము"అని నేను ఇంటెర్మిడియట్ లొ తెలుసుకోవడంతో ఆ రోజు నుంచి నేను మాట్లాడే భాషను గాని మెరుగుపర్చుకొవాలని ప్రయత్నిస్తునేఉన్నాను.నా అమ్మగారు నాకు ఆ సుభాషితం వినే అలవాటు చెసుండకపొయినట్లయితే తెలుగు బాష కోసం పరితపించే ఓ వ్యక్తిని ఈ సమాజం కొల్పొయుండేది. ఇక వ్యక్తిత్వ నిర్మాణంలో తర్వాత ముఖ్యమైన పాత్ర నిర్వహించేది ఉపాద్యాయురాలు.సాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయురాలు స్త్రీయే కాబట్టి మళ్ళీ స్త్రీయే ఈ పాత్ర నిర్వహిస్తుంది. ఇక తర్వాతి పాత్ర భార్యది. నా జీవితంలో నా భార్య " పోరు " కారణంగానే నేను ఉదయాన్నే నడకను అలవాటు చేసుకున్నాను.ఇది నా జీవితానికి ఒక గొప్ప ఆత్మవిమర్శ సాధనంగ ఉపయోగపడుతోంది. ఈ విదంగా ప్రతి పురుషిని జీవితంలో స్త్రీ అనెకానెక రకాలుగా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.కాబట్టి ఒక పురుషుని విజయం వెనకాల అనెక మంది స్త్రీలు ఉంటారనడంలో సందేహంలేదు.
కాని నేడు సమాజంలో స్త్రీ ని ఒక అబలగా మరీ ముఖ్యంగా చలనచిత్రాలలో అయితే ఒక వస్తువుగా చూపించటం బాధాకరం.చలనచిత్రాలలో యెల్లప్పుడూ ప్ర్రియుని కోసం పరితంచే ప్రియురాలిగానో , తన పెళ్ళి కోసం అన్నపై అధారపడే నిస్సహాయురాలైన చెల్లిగానో,కొడుకు సంపాదనపైనే అధారపడే తల్లిగానో,త్యాగంతో జీవితాన్ని భర్తకు అర్పించేసుకునే నిరర్ఠకత్యాగమూర్తిగానో చిత్రిస్తారు తప్పిస్తే ఒక వీరనారిగ,సబలగా,స్పూర్తిదాయకురాలిగ చిత్రించేవారు చాలా తక్కువ.కనీసం ఈ మహిళ దినొత్సవ సందర్భంగానైనా ప్రతి మహిళ అబల కాదు సబల అని నిరూపించేందుకు పునరంకితమవ్వాలని అశిస్తూ ,

2 comments:

Anonymous said...

విజయం సాధించే పురుషుని వెనుకా "ఒక" స్త్రీ వుంటుంది, అపజయం సాధించే ప్రతి పురుషుని వెనుకా "అనేక" మంది స్త్రీలుంటారు. లాంటివన్నీ మగ లాలిత్యంతోనో లేక పురుషాహంకారంతోనో ఇచ్చే స్టేట్‌మెంట్లు. పురుషుడైనా స్త్రీ అయినా విజయం సాధించాలంటే స్వయంకృషి పట్టుదల కావాలి, వెనుక ఎవరూ వుండక్కర్లేదు.

భావన said...

బాగుందండి. ఆకాశరామన్న గారన్నట్లు స్వయంకృషి పట్టుదల వుండాలి కాని దానితో పాటు మనిషి తోడు కూడా కావాలి, మొగవాళ్ళకు ఆ తోడూ స్త్రీ రూపం లో వస్తుంది కాబట్టి అలా అంటారేమో. చిన్నప్పుడు అమ్మ ప్రభావం లేని వాళ్ళు ఎవ్వరు వుండరేమో కదా.